బాలయ్యను చూస్తే జాలేస్తుందన్న కంగనా.. ఎందుకు ?

0
40

టాలీవుడ్ హీరో బాలకృష్ణను చూస్తే జాలేస్తుందని బాలీవుడ్ కంగనా రనౌత్ అంటోంది. స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా బాలయ్య బాబు తెరకెక్కించారు. వీటికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కానీ, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచాయి.

మరోవైపు, కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా ఝాన్సీ ల‌క్ష్మీ బాయి జీవిత ఆధారంగా మ‌ణిక‌ర్ణిక చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి కూడా తొలుత క్రిష్ జాగర్లమూడే దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ కోసం మణికర్ణికను క్రిష్ వదులుకున్నారు. దీంతో కంగనానే దర్శకత్వం వహించి చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేసింది. ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించి లాభాలు తెచ్చిపెట్టింది.

ఈ రెండు చిత్రాలకి డివైడ్ టాక్ రాగా, ఈ విష‌యంపై కంగ‌నాని త‌మిళ మీడియా ప్ర‌శ్నించింది. దీనికి సంచ‌ల‌న న‌టి ఘాటుగా స్పందించింది. “రెండు పార్టులుగా తెర‌కెక్కిన ఎన్టీఆర్ బ‌యోపిక్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జీరో రిక‌వ‌రీగా నిలిచాయ‌ని నేను విన్నాను. బాల‌కృష్ణ జీవితంలో అవి ఓ మ‌చ్చ‌గా మిగిలిపోతాయి. క్రిష్‌ని న‌మ్మిన బాల‌కృష్ణ‌ని చూస్తుంటే బాధ‌గా ఉంది. ఇప్పుడు ప్ర‌శ్నించే టైం నాకు వ‌చ్చింది. నా వ్య‌క్తిత్వంపై దాడి చేయ‌డ‌మేకాకుండా, నింద‌లు వేస్తూ రాబందుల్లా పీక్కు తిన్న‌వారు, త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన వారు ఇప్పుడేమంటారు” అని కంగ‌నా ప్రశ్నించింది.

Kangana Ranaut

క్రిష్‌కి మంచి సినిమాలు తీసే స‌త్తా ఉంటే క‌థానాయకుడు, మ‌హానాయ‌కుడు చిత్రాల ప‌రిస్థితి ఇలా ఎందుకైంద‌ని వాపోయింది. అంతేకాదు ఆయ‌న‌కి స‌పోర్ట్ చేస్తున్న కొన్ని మీడియా సంస్థ‌ల‌పై కంగ‌నా ఫైర్ అయింది. క్రిష్‌, కొన్ని పెయిడ్ సంస్థ‌లు నా చిత్రంపై బుర‌ద‌జ‌ల్లాయి. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు ఇలాంటి వారి కోసం రక్తం ధార‌పోయ‌డం నన్ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది అని కంగ‌నా పేర్కొంది. మ‌రి దీనిపై క్రిష్ ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.