టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెండో కుమారుడు, సినీ హీరో అల్లు శిరీష్‌పై మోసం కేసు నమోదైంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు పంపారు. అల్లు శిరీష్‌తో పాటు.. పలువురు సినీ ప్రముఖులు, క్రికెటర్లు కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో వారందరికీ సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులు జారీచేసిన వారిలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, బొమన్ ఇరానీ, పూజా హెగ్డే, అల్లు శిరీష్, క్రికెటర్ యువరాజ్ సింగ్‌లు ఉన్నారు. వీరంతా వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరుకాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అసలు వీరంతా ఎలాంటి మోసానికి పాల్పడ్డారో ఓసారి తెలుసుకుందాం. క్యూనెట్ అనేది ఓ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ. ఈ కంపెనీ తరపున సెలెబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. కంపెనీ యాడ్స్‌లో నటించారు. ఆ కంపెనీకి పబ్లిసిటీ చేశారు. ఈ ప్రకటనలు చూసి తాము క్యూనెట్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయాని చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులతో పోలీసులు ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. ఈ కంపెనీ అనేక మంది అమాయకుల నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకున్న క్యూనెట్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -