ముమ్మాటికీ ఆవుది తప్పుకాదు.. మనిషిదే..

0
32

ఈ సమాజంలో మనుషులకు ఏమాత్రం విలువ లేకుండా పోతోంది. వివిధ సంఘటనల్లో మనుషుల ప్రాణాలు పోతున్నా వాటికి పెద్దగా విలువ లేకుండా పోతోంది. పైగా, ఇవి న్యాయపరమైన సమస్యలుగా మారిపోతున్నాయి. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో జరిగిన సంఘటన అచ్చం అలాంటిదే.

రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని అడ్డొచ్చిన ఆవులను వదిలేసి.. ఖచ్చితంగా వేగంగా వస్తున్న వ్యక్తిదే తప్పు అంటూ కేసు కూడా నమోదు చేయలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి లాభం లేక కొడుకు మరణానికి ఏమీ చేయలేని ఆ తండ్రి నిస్సహాయతతో కుమిలిపోతున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే,

అహ్మదాబాద్‌కు సమీపంలోని కాజోల్ అనే ప్రాంతంలో సంజయ్ పటేల్(28) అనే వ్యక్తి కారు డీలర్‌గా పని చేస్తున్నారు. ఈయన తన విధులను ముగించుకుని అహ్మదాబాద్ హైవేపై మోటార్ సైకిల్‌పై ఇంటికి బయలుదేరాడు. ఆ సమయం లో రహదారిపై ఉన్నట్టుండి అకస్మాత్తుగా అప్పుడే రెండు ఆవులు రోడ్డుపైకి అడ్డంగా వచ్చాయి. హఠాత్ పరిణామానికి తేరుకునే లోపే ఆవులు గుద్దడం.. రోడ్డు మీద పడిపోవడంతో బ్రెయిన్‌కు దెబ్బ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.

Patel’s father కొడుకు మృతితో సంజయ్ తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకుని పశువుల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకుగాను ఏకంగా 14 పోలీస్ ఠాణాల చుట్టూ తిరిగాడు. కానీ, ఒక్కరు కూడా కేసు నమోదు చేయలేదు. పైగా రాష్ డ్రైవింగ్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన న్యాయపోరాటానికి దిగారు. ఇందులోకూడా.. మోటారిస్టుదే తప్పంటూ గుజరాత్ హైకోర్టు సైతం తేల్చింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక మరోమారు ఆయన పోలీసు కమీషనరును ఆశ్రయించాడు. మరి ఆయన ఏం చేస్తాడో చూద్ధాం.