అగ్రజుడి సంపద పైపైకి.. హారతి కర్పూరం అనుజుడి ఆస్తి

0
39

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరో రికార్డు సృష్టించారు. ప్రపంచ కుబేరుల జాబితా తొలి పది స్థానాల్లో తొలిసారి స్థానం దక్కించుకున్నారు. మొత్తం 5,400 కోట్ల డాలర్ల (రూ.3.83 లక్షల కోట్లు) సంపదతో 8వ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఈ స్థానం గత యేడాదితో పోల్చితే 11 స్థానాలు ఎగబాకారు. ఈ ఏడాదికి విడుదలైన హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో అంతర్జాతీయ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ 14,700 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో నంబర్‌వన్‌గా నిలిచారు. వరుసగా రెండో ఏడాదీ ఆయనదే అగ్రస్థానం.

 

 

మరోవైపు, వ్యాపార రంగంలో అన్న జోరుగా దూసుకెళుతుంటే… తమ్ముడు అనిల్‌ మాత్రం దివాలా తీసి పీకల్లోతు అప్పుల్లో అల్లాడుతున్నాడు. అగ్రజుడి సంపద ఏటేటా పెరుగుతూ పోతుంటే… అనుజుడి ఆస్తి మాత్రం హారతి కర్పూరంలా కరిగిపోతోంది.

ఆస్తి పంపకాల తర్వాత కొత్తగా ప్రవేశించిన టెలికాం, రిటైల్‌ రంగాల్లోనూ అన్న హవా కనబరుస్తుండగా.. తమ్ముడిది మాత్రం ఉన్న కంపెనీలే కాపాడుకోలేని పరిస్థితి. గడిచిన ఏడేళ్లలో ముకేశ్‌ ఆస్తి 3,000 కోట్ల డాలర్ల మేర పెరిగి రూ.8 లక్షల కోట్ల స్థాయిని అధిగమించగా.. అనిల్‌ 500 కోట్ల డాలర్లు పోగొట్టుకున్నారు. దాంతో ఆయన ప్రస్తుత ఆస్తి 190 కోట్ల డాలర్లకు, ర్యాంక్‌ ౧౩౪౭ కు పడిపోయింది.