జూనియర్ ఎన్టీఆరే టీడీపీ ఆస్తి.. నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే?

0
35

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో పదేళ్ల తర్వాత కోడలు నారా బ్రాహ్మణిని రాజకీయాల్లోకి దించే అవకాశం వుందని జగ్గారెడ్డి అన్నారు. అంతేకాకుండా.. రాజకీయాల్లోకి వస్తే బ్రాహ్మణికి తిరుగులేదు… టీడీపీకి ఆస్తి జూనియర్ ఎన్టీఆరేనని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు, బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి రాజకీయాల్లో చక్కగా రాణించగలరని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడప్పుడే చంద్రబాబు ఆమెను రాజకీయాల్లోకి రానివ్వబోరని, ఓ పదేళ్ల తరువాత రప్పించవచ్చని ఆయన అంచనా వేశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృత పర్యటనలు జరిపిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, బ్రాహ్మణికి రాజకీయాల్లో ఎదురుండదని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకే ఓ పెద్ద ఆస్తి అని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ భవిష్యత్తులో బ్రాహ్మణి, ఎన్టీఆరే పెద్ద దిక్కుగా మారే అవకాశం వుందంటూ జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంకా టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.