ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ-20 క్రికెట్ సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 350 సిక్సర్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా ధోనీ రికార్డు సాధించాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాది.. ఆల్ టైమ్ హైయెస్ట్ స్కోర్ సాధించిన ఆటగాళ్లలో ధోనీ ఐదో స్థానంలో నిలిచాడు.
ఆల్ టైమ్ హైయెస్ట్ స్కోర్ సిక్సుల జాబితాలో క్రిస్ గేల్ తాజాగా 500 సిక్సుల రికార్డు నెలకొల్పడంతో అగ్రస్థానంలో నిలవగా, పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ షాహిద్ అఫ్రిద్ 476 సిక్స్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. అలాగే తర్వాతి స్థానాల్లో మెక్ కల్లమ్ (398 సిక్సులు), శ్రీలంక లెజండ్ సనత్ జయసూర్య (352), ఆ తర్వాతి స్థానంలో ధోనీ 350 సిక్సులతో నిలిచాడు.
ఇకపోతే.. ప్రపంచ కప్‌కు ముందు భారత్‌లో ట్వంటీ20, వన్డే సిరీస్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బుధవారం రాత్రి జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అదీ కూడా భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు తొలిసారి ట్వంటీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.
కానీ భారత్ మాత్రం నాలుగేళ్ల తర్వాత స్వదేశంలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన జట్టుగా భారత్ నిలిచింది. కాగా 2015లో దక్షిణాఫ్రికాపై 0-2 తేడాతో భారత్ పరాజయాన్ని మూటగట్టుకుంది.