నేటి నుండి పదవ తరగతి పరీక్షలపై టి-సాట్ లైవ్

0
66
10వ తరగతి పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థులకు ‘పరీక్షల చిట్కాలు’ అవగాహన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వార అందించనుంది "టి-సాట్ "

పదవ తరగతి విద్యార్థుల కోసం టి-సాట్ మరో ప్రత్యేక పాఠ్యాంశాల ప్రసార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యేSoFTNETవీటితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగనున్న పోలీసు ఉద్యోగాల రాత పరీక్షలపైనా ప్రసారాలను అందించేందుకు సిద్ధమైంది.

టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలోని ఎస్.ఈ.ఆర్.టి-ఎస్.ఐ.ఈ.టి మరియు టి-సాట్ సంయుక్తంగా మార్చి ఒకటవ తేదీ నుండి విద్యార్థులు, పోలీసు ఉద్యోగార్థుల కోసం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలుంటాయని సీఈవో విడుదల చేసిన ప్రకటనలో వెళ్లడించారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఒత్తిడికి గురౌతారని, వారికి కలిగే ఒత్తిడిని దూరం చేసేందుకు టి-సాట్ తమ వంతు ప్రయత్నం చేస్తోందని శైలేష్ రెడ్డి వివరించారు.సుమారు 5,30,000 విద్యార్థులకు ప్రయోజనం జరుగుతుందన్నారు.

పదవ తరగతి సబ్జెక్టులపై ఎస్.ఈ.ఆర్.టి-ఎస్.ఐ.ఈ.టి ఆద్వర్యంలో గుర్తించిన ప్రత్యేక ఉపాధ్యాయులచే ఈ ప్రసార కార్యక్రమాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు. మార్చి ఒకటవ తేది శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు మూడు గంటల పాటు మాథమెటిక్స్, రెండవ తేదీన సైన్స్, ఐదున సోషల్ స్టీడీస్, ఆరున ఇంగ్లీష్, ఏడున తెలుగు,హిందీ, ఉర్దూ సబ్జెక్టులపైన అవగాహన కార్యక్రమాలుంటాయని సీఈవో వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగపర్చుకోవాలని సూచించారు. టి-సాట్ నిపుణ, విద్య ఛానళ్లతో పాటు టి-సాట్ సోషల్ మీడియాలోనూ ప్రసారాలు అందుబాటులో ఉంటాయన్నారు.

పోలీసు శాఖ ఉద్యోగాల పైనా….
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న సుమారు 18,428 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు త్వరలో జరగనున్న దృష్ట్యా రోజుకు ఎనిమిది గంటల చొప్పున అవగాహన పాఠ్యాంశాల ప్రసారాలు అందిస్తామని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. మార్చి ఒకటవ తేదీ ఉదయం ఏడు నుండి 10 గంటల వరకు, సాయంత్రం ఐదు నుండి 10 గంటల వరకు ప్రసారాలుంటాయన్నారు. పరీక్షలకు సంబంధించిన ఏడు సబ్జెక్టులు హిస్టరీ/జియోగ్రఫీ, పాలిటి/ఇండియన్ ఎకనామీ, జనరల్ సైన్స్(ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ), రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్/తెలుగు సబ్జెక్టులకు సంబంధించిన ప్రసారాలు చేయనున్నామని శైలేష్ రెడ్డి వివరించారు. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ చే లైవ్ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2018లోనే నోటీఫికేషన్ జారీ చేయగా మార్చి 24వ తేదీ వరకు శరీర ధారఢ్య పరీక్షలు నిర్వహిస్తుండటం అభ్యర్థులకు విధితమేనని గుర్తు చేశారు.