
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు ఆరు పదులకు పైగా ఉంది. ఆయనకు ఈ వయసులోనూ ఇద్దరు హీరోయిన్లు కావాలట. సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ – రజనీకాంత్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

అయితే, ఈ చిత్రానికి సంబంధించి రోజుకోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల చిత్రంలో కథానాయికగా నయనతారని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆ తర్వాత చిత్రంలో రజనీకాంత్ సామాజికవేత్తగా, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జరిగింది.
అయితే, తాజాగా చిత్రంలో ఇద్దరు కధానాయికలు ఉంటారని అందులో ఒకరు నయనతార కాగా, మరొకరు కీర్తి సురేష్ అని అంటున్నారు. నయనతార గతంలో రజనీతో కలిసి ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’ చిత్రాలు చేసింది.

కానీ కీర్తి ఇప్పటివరకు రజనీకాంత్‌తో ఒక్క చిత్రం చేయలేదు. ఈ చిత్రంలో తొలి ఛాన్స్ కొట్టేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో చూడాలి.