వంట గ్యాస్ మంట… నడ్డి విరుస్తున్న మోడీ సర్కారు

0
43
Cooking gas price up by Rs 2.08, non-subsidised rate hiked by Rs 42.50 per cylinder, Indian Oil Corporation (IOC) confirmed.

దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సబ్సి డీ సిలిండర్‌పై రూ.2.08, సబ్సిడీయేతర సిలిండర్‌పై రూ.42.5 పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) గురువారం తెలిపింది.

వరుసగా గత మూడునెలలు వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. కానీ, పెరిగిన చమురు ధరలపై పన్ను ప్రభావంతో గ్యాస్ సిలిండర్ ధరల పెంపు తప్పలేదని ఐఓసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.

ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.493.53 ఉండగా, మార్చి ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరలతో రూ.495.61 కానుంది. ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర రూ.701.50కు పెరుగనున్నది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు, విదేశీ మారకం విలువలో ఒడిదొడుకుల నేపథ్యంలో ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఏటా 12 వంట గ్యాస్ సిలిండర్లకు ప్రభుత్వం సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నది.