శౌర్యానికి కేరాఫ్ అడ్రస్ అభినందన్ ఫ్యామిలీ

0
44
Abhinandan and his parents.

పీవోకేలో ఉన్న ఉగ్రవాద తండాలపై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ యుద్ధ విమానాలతో దాడులకు దిగింది. ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టే పనిలో నమగ్నమై పాకిస్థాన్ సైనికులకు బందీగా చిక్కిన భారత వైమానికి దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ సురక్షితంగా భారత గడ్డపై అడుగుపెట్టారు. నిజానికి అభినందన్ కుటుంబం మూడు తరాలుగా దేశ సేవకే అంకితమైంది.

అభినందన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్ యుద్ధ విమానాన్ని పరీక్షిస్తే తనయుడు అభినందన్ ఏకంగా యుద్ధ విమానంతో గగనంలో విన్యాసాలే చేశాడు. అంటే.. ఈ కుటుంబానికి యుద్ధ విమానాలు నడుపడం కాఫీ తాగినంత సులువు, శౌర్యానికి ఆ కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులు అంటున్నారు.

ముఖ్యంగా, ఈ ఫ్యామిలీ గత మూడు తరాలుగా దేశ సేవకే అంకితమైందని చెప్పారు. అందుకే వర్ధమాన్ కుటుంబానికి ముద్దుగా మిగ్-21 ఫ్యామిలీ అని పిలుస్తారు. ఈ విమానాల్ని నడుపడం వారికి సంప్రదాయంగా వస్తున్నది. పైలట్ అభినందన్ తండ్రి ఎస్ వర్ధమాన్ మాజీ ఎయిర్ మార్షల్. వాయుసేన టెస్ట్ పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నప్పుడే అందుబాటులోకి వచ్చిన మిగ్-21ను నడిపి దాన్ని సామర్థ్యం పరీక్షించారు.

ఆ తర్వాత ఆయన కొడుకు అభినందన్ కూడా మిగ్-21 బైసన్ యుద్ధ విమానం నడుపడంలో అందె వేసినచేయి. రెండు రోజుల క్రితం భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ ఎఫ్-16 విమానాలను తరిమికొడుతూ వాటిలో ఒక దాన్ని కూల్చేశాడు. తండ్రి మిగ్-21 యుద్ధ విమానాల్ని పరీక్షిస్తే, కొడుకు అభినందన్ మిగ్-21 బైసన్‌తో పాక్ విమానాన్ని కూల్చివేసిన ధైర్యశాలి అని కితాబునిచ్చారు.