ప్రధాని పదవి ఓ పగటి కల.. దేశమే సర్వస్వం : నితిన్ గడ్కరీ

0
39

సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవి రేసులో తాను ఉన్నట్టు సాగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. తాను ప్రధాని పదవి రేసులో లేనని స్పష్టంచేశారు. తాను పూర్తిగా ఆరెస్సెస్ కార్యకర్తనని, దేశమే తనకు సర్వస్వమన్నారు.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ సభ ఏర్పడితే ఏకాభిప్రాయ ప్రధాని అభ్యర్థిగా తన పేరు ముందుకు వస్తుందన్న వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని చెప్పారు.

పైగా, ప్రధాని పదవి అనిదే తనకు కేవలం ఓ పగటి కల చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని అవుతారని చెప్పారు. మోదీడీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో ముందుకు వెళుతోందని, మేమంతా ఆయన వెనుకే ఉన్నామని చెప్పారు. పైగా, తాను పూర్తిగా ఆర్.ఎస్.ఎస్. వాదిని, దేశమే నాకు సరస్వం అని చెప్పారు.

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదాన్ని విశ్వసిస్తారా? అన్న ప్రశ్నపై గడ్కరీ స్పందిస్తూ రెండు పార్టీల సిద్ధాంతాలు వేర్వేరన్నారు. మేం శత్రువులం కాదు. మా మధ్య భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. ఇది మన సంప్రదాయం అని తెలివిగా సమాధానమిచ్చారు.