కావాల్సిన వస్తువులు…
పండిన టమాటాలు 4,
మిరియాలపొడి అర టీస్పూన్,
కొత్తిమీర పావుకట్ట,
దోసకాయ 1,
ఉప్పు తగినంత,
పచ్చిమిర్చి 2
తయారు చేసే విధానం
ముందుగా టమాటాలు చిన్న చిన్నముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. దోసకాయ తొక్కును తీసి సన్నగా తరగాలి. ఓ గిన్నెలో టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి బాగా కలిపి అందులో తగినంత ఉప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసి గంట సేపు ఫ్రీజ్‌లో ఉంచాలి. చివరగా కొత్తిమీరచల్లి సర్వ్ చేసుకోవాలి.