వేడినీటితో ఒబిసిటీ మాయం, మధుమేహం మటాష్.

0
58

చలికాలంలో వేడినీటి సేవనం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేయొచ్చు. ఇంకా వేడి నీటిని రోజూ తీసుకుంటూ వుంటే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. తద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. ఫలితంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపవచ్చు.

తాజాగా దేశంలోని ప్రజలను వణికిస్తున్న మధుమేహాన్ని తరిమికొట్టాలంటే వేడి నీటిని సేవించండి అంటున్నారు. వేడి నీటిని తాగడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరడమే కాకుండా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే రోజూ గోరువెచ్చని నీటిని సేవించాలని వారు చెప్తున్నారు. వేడినీటిని సేవిస్తే మధుమేహం రాదట‌. కీళ్ళనొప్పులుండవ‌ట‌. తద్వారా ఆర్థరైటీస్ సమస్యలు, ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవచ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్న మాట‌. గొంతు సమస్యలను దూరం చేసుకోవచ్చ‌ట‌. జలుబు, దగ్గు దరిచేరవు. వేడి నీటిని సేవించడం ద్వారా బరువు పెరగరు. తద్వారా ఒబిసిటీ సమస్య వుండదు. వేడి నీటిని సేవించడం ద్వారా ఒబిసిటీ సమస్య వుండదని సూచిస్తున్నారు.

ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకటి లేదా మూడు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. ఆ తర్వాత అల్పాహారానికి అర్థగంట తద్వారా ఓ గ్లాసుడు గోరువెచ్చని వేడి నీరు సేవించాలి. భోజనానికి తర్వాత, రాత్రి నిద్రించేందుకు గంట ముందు గోరువెచ్చని నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అనవసరపు కొవ్వు కరుగుతుంది. వేడి నీరు శరీరాన్ని చురుకుగా వుంచుతుంది. అయితే వేడినీటిని సిప్ చేస్తూ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.