దోసకాయ వడియాలు ఎలా తయారు చేస్తారు?

0
49
Dosakaya d
Dosakaya

కావలసిన వస్తువులు..
దోసకాయ చిన్నసైజ్ తీసుకోని తొక్కుతీసి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 10 మెత్తగా రుబ్బికోవాలి. అన్నం రెండు కప్పులు, జీలకర్ర 1 టీస్పూను, ధనియాల పొడి అరటీస్పూను, కరివెపాకు చిన్నకట్ట సన్నగా తరిగి ఉంచాలి. ఉప్పు తగినంత.

తయారు చేసే విధానం…
ముందుగా ఓక పాత్రలో దోసకాయగుజ్జు, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, ధనియాల పొడి, అన్నం కరివేపాకు తరుగు, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి.

ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్ మీద వడియాలు పెట్టుకోవాలి. ఓ నాలుగు రోజులు బాగా ఎండ బెట్టాలి. ఇప్పుడు గాలి చొరబడని డబ్బాలో నిల్వ వుంచాలి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో వేయించుకోవాలి.

ఈ రుచికరమైన దోసకాయ వడియాలు సాంబారులోకి, రసంలోకి కలిపి తింటే చాలా బాగా ఉంటాయి. ఇక మీదే ఆలస్యం ప్రయత్నించండి.