భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పేరుతో సోషల్ ఖాతాలు ఉన్నట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా, అభినందన్ ట్విట్టర్ ఖాతాలో అనేక ట్వీట్లు వస్తున్నాయి. ఇవి నిజంగానే అభినందన్ చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఆ ట్వీట్లకు రీ ట్వీట్లు కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అభినందన్‌కు ఎలాంటి అకౌంట్లు లేవని క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా యూజర్లు ఎవరూ అభినందన్ పేరుతో ఉన్న అకౌంట్లను ఫాలో కావొద్దని సూచన చేసింది. అయితే, ఆయన పేరుతో ఉన్నవన్నీ ఫేక్ అకౌంట్లేనని తేల్చి చెప్పింది.
ఈ మేరకు అభినందన్ పేరుతో ఉన్న కొన్ని ఫేక్ అకౌంట్లను ఐఏఎఫ్ ట్విట్టర్లో షేర్ చేసింది. కాగా, కొందరు వ్యక్తులు అభినందన్ పేరుతో ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ఖాతాలు తెరిచి అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఐఏఎఫ్.. అభినందన్ సోషల్ మీడియా అకౌంట్ల వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది.