ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు వన్డేలకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ దూరంగా ఉంటున్నాడు. దీంతో స్వదేశంలో మహేంద్రసింగ్ ధోనీ ఆఖరి మ్యాచ్ ఇదేనని క్రీడా పండితులు అంటున్నారు. ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ధోనీకి విశ్రాంతినిస్తున్నాం. అతని స్థానంలో యువ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. దీంతో ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు ధోనీ దూరమవుతాడని ప్రచారం సాగుతోంది.
ఆస్ట్రేలియాతో సొంత గడ్డైన రాంచీలో ఆడిన ధోనీ ప్రపంచకప్ తర్వాత క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సొంతగడ్డపై ఆసీస్తో మ్యాచ్ ఆఖరాటగా భావిస్తున్నారు. మెగాటోర్నీ ముగిసిన తర్వాత భారత్కు స్వదేశంలో ఎలాంటి సిరీస్లు లేకపోవడం.. సొంతగడ్డపై ధోనీకి ఇదే చివరి మ్యాచ్ అవుతుందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీకి ఘనంగా వీడ్కోలు పలుకాలని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది.