ఒక్క కన్నుగీటు సన్నివేశంతో యావత్‌భారతావనిని తనవైపునకు తిప్పుకున్న హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. ఈ ఒకే ఒక్క సన్నివేశంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.
‘ఒరు ఆధార్ లవ్’ సినిమాలోని ఓ పాటలో కన్నుగీటి ఆమె చేసిన హంగామా మూలంగా.. ఆ సినిమా విడుదలకు ముందే ఆమెకు భారీ పాపులారిటీని కొట్టేసింది. దీంతో అప్పటిదాకా జరిగిన స్క్రిప్ట్ పనుల్లో మార్పులు చేసి ప్రియానే లీడ్ రోల్‌గా చూపిస్తూ సినిమాను తెరకెక్కించారట దర్శక నిర్మాతలు.
అయితే తెలుగు, మలయాళ భాషల్లో ఇటీవలే విడుదలైంది. ‘లవర్స్ డే’ పేరుతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఫలితంగా ప్రియా ప్రకాష్ వారియర్‌పై పెట్టుకున్న అంచనాలు తలక్రిందులయ్యాయి.
ఈ పరిస్థితి గల కారణాలపై ఆ సినిమా దర్శకుడు ఒమర్ లులు.. సినిమా ఫెయిల్యూర్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కానేకాదని స్పష్టం చేశారు. ‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో కన్నుకొట్టే సన్నివేశంతో ఆమె సెన్సేషన్ కావడంతో చిత్ర నిర్మాతలు ప్రియానే లీడ్ రోల్‌లో ఉండేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని బలవంత పెట్టారని ఆయన వివరించారు.
ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ వేరే అని, యువ జంట హత్య నేపథ్యంలో స్క్రిప్ట్ రాసుకుంటే.. ప్రియా ప్రకాష్ హైలైట్ అయ్యేలా నిర్మాతలు అందులో మార్పులు చేయించారన్నారు. చిత్రంలో మరో రోల్ పోషించిన న్యూరిన్ షరీఫ్.. ప్రియా కంటే బెస్ట్ యాక్టర్ అని ఆయన కితాబిచ్చారు.