పొల్లాచ్చి ఘటన కలకలం.. కారులో ఎక్కించుకుని గ్యాంగ్ రేప్.. వీడియో..?

0
74

పొల్లాచ్చి ఘటన ప్రస్తుతం తమిళనాట కలకలం రేపింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమై ముక్కూమొహం తెలియని వారితో స్నేహం చేసిన పాపానికి బాలికలు, యువతులు బలైపోతున్నారు. అలా స్నేహం పెంచుకున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ముఠాను పొల్లాచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చికి చెందిన తిరునావుక్కరసు అదే ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినితో ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో అతను తన స్నేహితులను పరిచయం చేస్తానని ఫిబ్రవరి 12న ఆమెను కార్లో తీసుకువెళ్లాడు. ఉసిలంపట్టి అనే ప్రాంతంలో తిరునావుక్కరసు నలుగురు మిత్రులు కార్లో ఎక్కారు.

నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అందరూ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. లైంగికవాంఛ తీర్చమని అనేకసార్లు ఒత్తిడి చేశారు. దీంతో కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసిన బాధితురాలు.. పోలీసులకు తనపై జరిగిన అకృత్యాన్ని గురించి వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై గుండా చట్టం కింద కేసు నమోదు చేశారు.