మటన్ తీసుకెళ్లి వండితే బీఫ్ అని తెలిసింది.. ఎన్నారై ఏం చేశాడంటే..?

0
43

ఎన్నారైకి ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. కివీస్‌లో బార్బర్‌గా పనిచేసే జస్వీందర్ పాల్ అనే ఎన్నారైకి, కొన్నాళ్ల క్రితం బ్లెన్ హీమ్ పట్టణంలో వున్న సూపర్ మార్కెట్‌కు వెళ్లి మటన్ లేబుల్ వేసివున్న శుద్ధిచేసిన మాంసాన్ని కొనుగోలు చేశాడు.

కానీ దాన్ని ఇంటికి తీసుకు వచ్చి శుభ్రంగా వండుకుని షాక్ అయ్యాడు. అది గొర్రె పిల్ల మాంసం కాదని, గొడ్డుమాంసం అని రుచిని బట్టి అర్థం చేసుకుని… మోసపోయాడని తెలుసుకుని మోసపోయానని భావించి వెంటనే ఆ సూపర్ మార్కెట్‌కు వెళ్లి నానా రభస చేశాడు.

బీఫ్ తినడం కారణంగా తాను అపవిత్రుడ్నయ్యానని, భారత్ వెళ్లి శుద్ధికరణ ప్రక్రియ చేయించుకోవాలని, అందుకు గాను రానుపోను చార్జీలు చెల్లించాలని సూపర్ మార్కెట్ వర్గాలను డిమాండ్ చేశాడు.

బీఫ్ తినడం కారణంగా తన ఆత్మ కలుషితం అయిందని, హిందూయిజం ప్రకారం తాను సొంతదేశానికి వెళ్లి నాలుగు నుంచి ఆరు వారాల పాటు అనేక క్రతువులు చేయాలని వెల్లడించాడు. సూపర్ మార్కెట్ వర్గాలు పాల్‌కు క్షమాపణలు చెప్పాయి.

అయితే ఆ బార్బర్ మాత్రం ససేమిరా అంటూ తాను భారత్ వెళ్లి వచ్చేందుకు అవసరమైన ఖర్చులు చెల్లించాల్సిందేనని భీష్మించుకున్నాడు. సూపర్ మార్కెట్ నుంచే డబ్బును తీసుకుంటానని ఎన్నారై స్పష్టం చేశాడు.