దేవాన్ష్‌తో ఆడుకునేందుకు బాబుకు విశ్రాంతినిద్ధాం : నాగబాబు

0
45
Nagababu
Nagababu

మనువడు నారా దేవాన్ష్‌తో ఆడుకునేలా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు విశ్రాంతినిద్దామని మెగా బ్రదర్ నాగబాబు ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసు అని, అందరూ 60 ఏళ్లకే విశ్రాంతి తీసుకుంటుంటే ఆయన మాత్రం ఇంకా కష్టపడాలా? అంటూ సెటైర్ వేశారు.

నాగబాబు ఇటీవల గుంటూరులో పర్యటించారు. అపుడు జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్యే లోకేష్ ఓ మాటన్నాడు. 70 ఏళ్ల వయసులో కూడా మా నాన్న చాలా కష్టపడుతున్నాడని అన్నాడని గుర్తుచేశారు.

ఒక కుమారుడుగా లోకేష్ బాధపడటంలో తప్పులేదు. అందుకే మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారికి విశ్రాంతి ఇస్తాం. తాత దగ్గర ఎలా ఆడుకోవాలో దేవాన్ష్ కూడా తెలుసుకోవాలి కదా! మళ్లీ బాబే రావాలి అని ఎవరైనా కోరుకుంటే వాళ్లకి ఒకటే చెబుతున్నాం… మేం ఆయనకి తప్పకుండా రెస్ట్ ఇచ్చి తీరుతాం అని నాగబాబు జోస్యం చెప్పారు.