కొర్రలతో కొవ్వుకు చెక్..

0
84
Foxtail Millets
Foxtail Millets

చిరు లేదా సిరి ధాన్యాలుగా పిలువబడే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మన ఆహారంలో చేర్చుకోవటం వలన అధిక బరువును తగ్గించుకోవచ్చు. వరి బియ్యం వండుకున్నట్లుగానే కొర్ర బియ్యాన్ని వండుకోవచ్చు. ఎక్కువ శక్తినిస్తాయి.

సెటారియా ఇటాలికా జాతికి చెందిన కొర్రలు ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో ఓ భాగంగా చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాంటి కొర్రలను రోజు వారీ డైట్‌లో చేర్చుకున్నట్టయితే కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే,

* జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి.
* కొర్రల్లో ప్రొటీన్లు 11 శాతం ఉంటాయి.
* కొర్రలతో చేసిన ఆహారం తింటే కొవ్వు పెరిగే సమస్యే ఉండదు.
* మధుమేహాన్ని నియంత్రించటంలో కొర్రలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
* శరీరంలోని జీవక్రియల్ని సక్రమంగా నడిపించే శక్తి ఈ తృణధాన్యాలకుంది.
* కొర్రల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో సులువుగా జీర్ణమైపోతుంది.