రెండు ఫ్యాన్లు వస్తున్నాయ్… జగన్ ఫ్యాన్‌ రేంజ్ తక్కువ.. బాబు సెటైర్లు

0
56

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైకాపా చీఫ్ జగన్ ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని.. ఏపీకి ద్రోహం చేసిన అన్యాయం చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. అంతేగాకుండా జగన్‌పై వున్న కేసులకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో ఎండగట్టారు. అంతటితో ఆగకుండా జగన్‌పై వంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి రెండు ఫ్యాన్‌లు వస్తున్నాయంటూ సెటైర్లు విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి టీడీపీ, ప్రజాశాంతి పార్టీ మధ్యే పోటీ ఉంటుందన్న కేఏ పాల్ వ్యాఖ్యలపై చంద్రబాబు అందరినీ నవ్వించారు. జగన్ ఫ్యాన్ కంటే హెలికాప్టర్ ఫ్యానే పవర్ ఫుల్ అంటూ వ్యాఖ్యానించారు. జగన్ ఫ్యాన్‌కు రేంజ్ తక్కువ. హెలికాప్టర్ ఫ్యానుకు పెద్ద రేంజ్ ఉంటుందని బాబు ఎద్దేవా చేశారు.