మనసుకు నచ్చిన చిత్రాలే చేస్తా : కీర్తి సురేష్

0
30

తన మనసుకు నచ్చిన చిత్రాలు మాత్రమే చేస్తానని మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. కథ నచ్చని పక్షంలో ఆ చిత్రంలో నటించబోనని తేల్చి చెప్పారు. నటించే నాలుగు చిత్రాలు మంచిగా ఉండాలన్నదే తన అభిమతమన్నారు.

తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, వ్యక్తిగత విషయాల్లో మనసుకు నచ్చింది చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు. కానీ వృత్తిపరంగా మాత్రం కొత్తలో చాలా భయాలుండేవి. తెలియకుండా ఏం చేస్తే, ఏమవుతుందో అనిపించేదన్నారు.

కానీ, అనుభవం, చుట్టూ వాతావరణం, వ్యక్తుల ప్రభావంతో క్రమంగా ఆ భయం పోయిందని తెలిపారు. గట్టిగా అనుకుంటే ఏమైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం పెరిగింది. అందుకే వృత్తిపరంగా కీలక నిర్ణయాలు తీసుకొన్నాను, వాటితో ఫలితాల్ని సొంతం చేసుకున్నట్టు చెప్పారు. తెలియని భాషలో డబ్బింగ్‌ చెప్పుకోవడం, సవాళ్లతో కూడిన కథల్ని ఎంపిక చేసుకోవడం లాంటివి అందులో భాగమే అని కీర్తి చెప్పుకొచ్చింది.

అయితే కొన్ని విషయాల్లో అసలు మారకూడదని పరిశ్రమకి వచ్చే ముందు అనుకొన్నా, దాన్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకొని నాకు నప్పే పాత్రల్లో నటిస్తూ ప్రయాణం చేస్తున్నానని చెప్పింది కీర్తి.