సైనా బయోపిక్.. శ్రద్ధా కపూర్ ఔట్.. పరిణీతి చోప్రాకు ఛాన్స్?

0
53
Parineeti Chopra
Parineeti Chopra

భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లో ఇప్పటికే పలు బయోపిక్‌లు వెండితెరపై దృశ్యకావ్యంగా వచ్చాయి. ఈ క్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్‌కి కూడా రంగం సిద్ధమైంది.

ఈ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ సమ్మతించింది. ఆ తర్వాత సైనా నెహ్వాల్ పాత్రలో ఒదిగిపోవాలనే ఉద్దేశంతో, బ్యాడ్మింటన్‌లో శిక్షణ కూడా తీసుకుంది. అలాంటి శ్రద్ధా కపూర్ తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

శ్రద్ధా కపూర్ ఇచ్చిన డేట్స్‌లో కాకుండా ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రారంభంకానుంది. దీనికితోడు శ్రద్ధా కపూర్ ఇప్పటికే అంగీకరించిన ఇతర ప్రాజెక్టుల నుంచి ఆమెపై వత్తిడి పెరుగుతూ వస్తోందట. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడమే మంచిదని భావించి ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందట.

ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరించి ఈ ప్రాజెక్టు నుంచి పరస్పర అంగీకారంతోనే తప్పుకుందని బాలీవుడ్ వర్గా సమాచారం. దీంతో శ్రద్ధా కపూర్ స్థానంలో పరిణీతి చోప్రాతో సంప్రదింపులు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.