న్యూజిలాండ్ మృతుల్లో ఇద్దరు హైదరాబాద్ టెక్కీలు..

2 Indian techies killed in New Zealand mosque Shooting

0
100
techies
techies

ఇటీవల న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్ నగరంలోని మసీదుల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు తెలంగాణవాసులు మృతి చెందారు. వీరిద్దరూ కివీస్‌ టెక్కీలుగా పని చేస్తున్నారు. శుక్రవారం కాల్పుల తర్వాత ఆచూకీలేని ఫర్హాజ్ హసన్ చనిపోయినట్టు వెల్లడైంది. ఆయన మృతదేహం శనివారం లభించింది. మరణించిన మరో వ్యక్తిని కరీంనగర్‌కు చెందిన ఇమ్రాన్‌ఖాన్‌గా గుర్తించారు.

ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన ఇక్బాల్ జహంగీర్‌కు ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈయన పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ టోలిచౌకిలోని నదీం కాలనీలో నివసిస్తున్న సైదుద్దీన్ కుమారుడు ఫర్హాజ్ హసన్ (31) కాల్పుల ఘటన తర్వాత కనిపించడంలేదని భావించారు. ఆయన భార్య స్థానిక అధికారులను సంప్రదించడంతోపాటు అక్కడి దవాఖానకు వెళ్లి పరిశీలించారు. ఫర్హాజ్ మృతదేహం లభ్యం కావడంతో అతడు మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు.