ఎద్దు నుంచి పాలు పితుకుతావా చంద్రన్నా.. ఆ యాడ్ గోలేంటి?

0
49

మహిళా సాధికారతే ధ్యేయంగా పసుపు- కుంకుమ పథకాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకం కింద దేశంలోనే మొదటి సారిగా డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 20 వేల రూపాయిలు, ఆవుపై 70 శాతం సబ్సిడి కేటాయించారు.

ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. ఓట్లు ఓ రేంజ్‌లో గుద్ది పడేసేందుకు ఓ యాడ్‌ను రూపొందించారు. ఈ యాడ్ టీడీపీకి ఓట్లు కురిపిస్తుందా లేదా అన్న విషయాన్ని పక్కనపెడితే.. నవ్వులపాలు అయ్యేట్టు చేసింది.

ఇంతకీ ఏమైందంటే.. నిమిషం నిడివితో వున్న ఈ యాడ్‌ని భార్యాభర్త ఓ చిన్నారిపై రూపొందించడం జరిగింది. ఇందులో చంద్రన్న పసుపు కుంకుమ పథకానికి ప్రచారం కల్పిస్తూ.. నాటకీయతను చొప్పిస్తూ యాడ్ రూపొందించారు. కంటెంట్, విజువల్ అంతాబాగుంది.

కానీ ఈ యాడ్‌లో డ్వాక్రా మహిళగా నటించిన మహిళ.. చంద్రన్న పసుపు కుంకుమగా ఇచ్చిన రూ.20 వేల రుణంతో ఆవు, దూడను కొని ఇంటికి తీసుకురావడం.. అన్న ఆవుని కొనిచ్చాడు.. మా చంద్రన్న ఇచ్చాడు అంటూ భర్తతో చెప్పేట్లు వుంది. అయితే ఈ యాడ్‌లో ఆవుకు బదులు ఎద్దు కనిపించింది. ఎద్దు ఎలా పాలు ఇస్తుంది చంద్రన్నా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.