చంద్రబాబు కేసీఆర్‌కు జూనియర్… ఆయనే మా కింద పనిచేశారు..

0
77

సీఎం కేసీఆర్, సీఎం చంద్రబాబుకు రిటన్ గిప్ట్ ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడంతో బాబు స్పందించారు. రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారో.. రాజకీయంగా ఏం చేస్తారో చేసుకోండంటూ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. ఏపీని దొంగదారిన దెబ్బతీస్తామంటే సహించేది లేదని బాబు హెచ్చరించారు. టీడీపీ కోసం పనిచేస్తున్న కంపెనీని దెబ్బతీసి రాజకీయంగా నష్టం చేయాలనుకున్నారని.. అందుకే ఇలా కేసులు, హడావుడి చేస్తున్నారన్నారు.

మరోవైపు టీడీపీ అధినేత బాబుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబే తమ కింద పని చేసారన్నారు. కేసీఆర్ తన కింద పనిచేశారంటూ ఆపధర్మ సీఎం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాస్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

”మేం కాదు.. చంద్రబాబే మా కింద పనిచేశారు” అని ఎర్రబెల్లి తెలిపారు. టీడీపీలో బాబు కంటే ముందు నుంచే కేసీఆర్, తాను క్రియాశీలకంగా ఉన్నామని చెప్పారు. పార్టీలో చేరి బాబు.. గ్రూపు రాజకీయాలు చేసి పార్టీని నాశనం చేశారని విమర్శించారు.

తమలాంటి వాళ్లను టీడీపీలో తొక్కిపెట్టారని ఎర్రబెల్లి ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించాలని చూసిన బాబుకు అక్కడి ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తున్నానని ఎర్రబెల్లి వెల్లడించారు.