అపుడే ముద్దులు పెట్టనని – అవి చూపించబోనని చెప్పేశా : మిల్కీబ్యూటీ

0
46
tamannah kiss
tamannah kiss

టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా తన సినీ కెరీర్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, కేరీర్ ఆరంభంలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. ప్రధానంగా ముద్దు, శృంగారభరిత సన్నివేశాల్లో నటించనని కెరీర్ మొదట్లోనే చెప్పానని వెల్లడించింది.

తాజాగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా పలు విషయాలపై చర్చించింది. ఈ సందర్భంగా ‘నో కిస్సింగ్’ పాలసీ గురించి తమన్నా మాట్లాడుతూ.. ముద్దు, శృంగారభరితమైన సన్నివేశాల్లో నటించాలని తనను ఎవ్వరూ బలవంతపెట్టరని తెలిపింది.

తాను కెరీర్‌ మొదట్లోనే అలాంటి సన్నివేశాల్లో నటించనని చెప్పేశానని, తనకు ఆ క్లారిటీ ఉందని, తననెవరూ బలవంతపెట్టలేరని తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఫలానా అభ్యంతకర సన్నివేశంలో నటించాలని ఇబ్బంది పెట్టారన్నా అందులో నిజం ఉండదని మిల్కీ బ్యూటీ తెలిపింది.

దీనికి కారణం కూడా చెప్పింది. మనకు తెలియకుండా ఏమీ చేయమని, నచ్చకపోతే వద్దు అని చెప్పి తప్పుకోవచ్చని వివరించింది. ఎవరి నిర్ణయాలు వాళ్లవని తమన్నా తెలిపింది. ఇక పెళ్లి విషయమై మాట్లాడుతూ, ఇప్పట్లో తనకు పెళ్లి ఆలోచనే లేదని చెప్పుకొచ్చింది.