హీరో అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం వచ్చే నెల 8వ తేదీ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్, బన్నీ కలయికలో గతంలో వచ్చిన ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాయి.
ఈ రెండు చిత్రాల్లో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఇతివృత్తంగా చేసుకుని నిర్మించారు. అయితే తాజాగా వస్తున్న కొత్త ప్రాజెక్టుకు కూడా త్రివిక్రమ్ ఇదే ట్రెండ్‌ను కొనసాగించనున్నాడట. ఈ చిత్రంలో కూడా తండ్రీకొడుకుల మధ్య ఉన్న ప్రేమాను బంధాలనే చూపించనున్నారట. అంతేకాకుండా ఈ సినిమాకు ‘నాన్న-నేను’ అనే టైటిల్ పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, రాధాకృష్ణ.. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని బేనర్లపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్రివిక్రమ్ఈ చిత్రంలో బన్నీని సరికొత్త లుక్‌లో చూపించనున్నాడు. ఎస్.ఎస్. థమన్ సంగీత బాణీలు సమకూర్చనున్నాడు. కథానాయికలుగా రష్మిక మంథాన, పూజా హెగ్డే, కేథరిన్‌లలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉందని విశ్వనీయ వర్గాల సమాచారం.