టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో త్రిష ఒకటి. ఈ చెన్నై చిన్నది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు నటనలోనే కాదు వివాదాస్పద చర్యల్లో ఆమెకు ఆమెసాటి. తెలుగులో దాదాపుగా హీరోలందరితోనూ నటించింది.
గత యేడాది తమిళంలో ’96’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచింది. అందుకుగాను ఆమెకు చాల అవార్డులే వరించాయి.
ప్రస్తుతం ఆమె వయసు 35 యేళ్లు. అయినా ఇంకా బ్యాచిలర్‌గానే ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. తన పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను సింగిల్ అని.. ఎవ్వరినీ ప్రేమించలేదని తెలిపింది.
అయితే తనకు తగినవాడు తారసపడితే మాత్రం వివాహం చేసుకునేందుకు సిద్ధంగా వున్నానని త్రిష ప్రకటించింది. సో… ఈ చార్మింగ్ బ్యూటీ త్రిష త్వరలోనే ఓ ఇంటికి కోడలు కానుందన్నమాట.