మజిలీకి మా లైఫ్‌కు లింకు లేదు.. సమంత

0
37
na-samantha

na-samantha

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, సమంత నాయికగా ‘మజిలీ’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సమంత, చైతూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకు తమ వైవాహిక జీవితానికి ఎలాంటి సంబంధం, పోలిక లేదని సమంత వెల్లడించింది.

ఈ సినిమాలో చైతూ – సమంత భార్యాభర్తలుగానే కనిపించనున్నప్పటికీ.. ఈ సినిమాకు తమ వైవాహిక జీవితానికి ఎలాంటి పోలికలుండవని సమంత వెల్లడించింది. ముఖ్యంగా ‘మజిలీ’లో చైతూ పాత్రకు.. ఆయన రియల్ క్యారెక్టర్‌కి అసలు సంబంధమే ఉండదు. కథలోని కొత్తదనం కారణంగానే ఈ చిత్రాన్ని ఒప్పుకుని చేశామని సమంత తెలిపింది. కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడొచ్చునని సమంత తేల్చేసింది.