వెంట్రుకల సంరక్షణ చిట్కాలు..

0
53

శిరోజాల సంరక్షణలో అమ్మయిలు లేదా మహిళలు ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. వెంట్రుకల సంరక్షణ కోసం వారు గంటల కొద్ది సమయాన్ని వెచ్చిస్తుంటారు. ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే శిరోజాలను రక్షించుకోవచ్చని బ్యూటీషియన్లు సలహా ఇస్తున్నారు.

* జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
* సాధారణ వెంట్రుకలు ఉండేవాళ్లు చేపలు, చికెన్, మెులకలు, పప్పులు బాగా తినాలి.
* బిరుసు వెంట్రుకలు ఉన్నవారు పచ్చికూరగాయలు, పప్పు ధాన్యాలు, దంపుడు బియ్యం, నట్స్, విటమిన్ ఇ కాప్యూల్స్ తీసుకోవాలి.
* జిడ్డు వెంట్రుకలు ఉన్నవారు ఆకుకూరలు, తాజా పళ్లు, సలాడ్స్, పెరుగు తినాలి.
* శిరోజాలు అందంగా ఉండాలంటే మనం వాడే షాంపూ విషయంలో జాగ్రత్తపడాలి.
* పొడి జుట్టు వారు మైల్డ్ షాంపూలు వాడాలి. పొడి జుట్టుకు ఎక్కువ షాంపూను వాడకూడదు.
* తల దురద పెడుతుంటే రెండు టేబుల్‌స్పూన్ల నిమ్మరసం, ఆలివ్ అయిల్, నూనె మిశ్రమంతో కలిపి జుట్టుకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకుని 20 నిమిషాలు తర్వాత నీళ్లతో కడిగేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది.