గోరు వెచ్చని నీటిలో దూది తడిపి… మేకప్ రిమూవర్ టిప్స్

0
222

సాధారణంగా ప్రతి అమ్మాయి, యువతి లేదా మహిళ మేకప్ వేసుకునేటపుడు మాత్రమే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. కానీ, మేకప్ తొలగించేటపుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బ్యూటీషియన్లు సలహా ఇస్తున్నారు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.

సహజమైన పద్ధతిలో మేకప్‌ని తొలగించాలంటే పాలు లేదా పెరుగును ముఖానికి పట్టించి తొలుత దూదితో తుడిచేయాలి. అలాగే, ఇంట్లోనే ఐ మేకప్‌ రిమూవర్‌ని తయారు చేసుకోవాలి. ఒక పాత్రలో టీ స్పూన్‌ ఆముదం, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, టీ స్పూన్‌ వంటనూనె వేసి మూడూ బాగా కలపాలి. ఈ నూనెను దూదితో అద్దుకుని కంటి చుట్టూ, ఐలైనర్, మస్కారా వాడినచోట సున్నితంగా రుద్దితే ఐ మేకప్‌ సులభంగా తొలగుతుంది.

ఇకపోతే, గోరువెచ్చటి నీటిలో దూది లేదా మెత్తని కాటన్‌ క్లాత్‌ను ముంచి గట్టిగా పిండాలి. ఆ తడి క్లాత్‌తో మరోసారి ముఖాన్ని తుడవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. మేకప్‌ వేసుకునే అలవాటు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు వెంట లిప్‌స్టిక్, బ్లషర్, పౌడర్, దువ్వెన, టిష్యూపేపర్, సేఫ్టీపిన్స్‌… ఇలాంటివన్నీ ఉండే చిన్న టచ్ అండ్ అప్ కిట్‌ను వెంట తీసుకుని వెళ్లడం మంచిది. మేకప్‌ చెదిరినా, తీసివేయాలన్నా తడుముకోవాల్సిన అవసరం ఉండదు.