సోమవారం (25-03-2019) దినఫలాలు..

0
52
daily astro
daily astro

మేషం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కానరాగలదు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు.

వృషభం : సన్నిహితుల నుంచి ఆకర్షనీయమైన కానుకలు అందుకుంటారు. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా వ్యవహరించి పూర్తి చేస్తారు. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. ప్రముఖులను కలుసుకుంటారు.

మిథునం : బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. పాత వస్తువులు కొని సమస్యలు తెచ్చుకోకండి.

కర్కాటకం : మీ సంతానం విద్య, వివాహాది విషయాలపై శ్రద్ధ కనబరుస్తారు. కాంట్రాక్టర్లుకు లభించిన టెండర్లు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలించవు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

సింహం : ఉపాధ్యాయులకు సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ముఖ్యులకు బహుమతులు అంజేస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయ నాయకులకు మెళకువ అవసరం. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది.

కన్య : ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. బ్యాంక్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి.

తుల : వృత్తి, వాణిజ్య రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. కళాకారులు, సినిమా రంగాల్లో వారికి అభిమాన బృందాలు పెరుగుతాయి. ఏమరుపాటుతనంతో ఉద్యోగస్తులతు ఇబ్బందులు తప్పవు. తప్పనిసరి చెల్లింపులు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు.

వృశ్చికం : స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడటం మంచిది. ఉపాధ్యాయులు ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనస్సు : ఉద్యోగస్తులు అనవసర విషయాలకు, అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఆత్మ విశ్వాసంతో యత్నాలు కొనసాగించడం మంచిది. మీ ఆశయం నెరవేరడానికి బాగా శ్రమించాల్సి వస్తుంది. స్త్రీలు పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతంగా ఉండదు.

మకరం : స్త్రీలకు టివి కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణలకు అనుమతులు వస్తాయి. శ్రీవారు, శ్రీమతిల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే పరిణామాలు ఎదుర్కుంటారు. ఖర్చులు రాబడికి మించడంతో చేబదుళ్లు, రుణాలు స్వీకరిస్తారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం : ఆర్థికస్థితి కొంత మేర మెరుగుపడుతుంది.బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. పెద్దలను, ప్రముఖులను కలుసుకొని వారికి బహుమతులు అందజేస్తారు. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించాల్సి వస్తుంది.

మీనం : స్త్రీలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారులకు సామాన్యం. ఆస్తి విషయంలో సోదరుల నుంచి ప్రతికూలతలు ఎదుర్కొనవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.