మోదీ, రాజ్‌నాథ్ బీఫ్‌ బిర్యాని తిని పడుకున్నారా?.. ఓవైసీ ఫైర్

0
33

ప్రధాని నరేంద్ర మోదీపై మజ్లిస్ పార్టీ అధినేత, లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పుల్వామా ఉ‍గ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై ఓవైసీ తాజాగా స్పందిస్తూ.. మోదీపై నిప్పులు చెరిగారు.

జమ్మూకాశ్మీర్‌లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏం చేస్తున్నారని నిలదీశారు. వీరిద్దరూ బీఫ్ తిని పడుకున్నారా? అని నిలదీశారు.

హైదరాబాద్‌లో అసద్ మాట్లాడుతూ.. భారత వాయుసేన పాకిస్థాన్‌లో బాల్‌కోట్‌లో వున్న ఉగ్రస్థావరాలపై బాంబులు విసిరింది. ఈ దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అంటున్నారు. మరోవైపు హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాత్రం ఉగ్రవాదులకు సంబంధించిన 300 ఫోన్లను ట్యాప్‌ చేశామంటారు.

బాలకోట్‌లో 300 ఫోన్లు కనిపించిన మీకు.. ఓ ఉగ్రవాది 50 కేజీల ఆర్డీఎక్స్‌ను పుల్వామాకు తరలించడం మాత్రం కనిపించలేదు. అప్పుడు ఏం చేస్తున్నారు? బీఫ్‌ బిర్యాని తిని పడుకున్నారా?అని ఎద్దేవా చేశారు.