ఈ రోజు (29-03-2019) మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి?

0
52
daily astro
daily astro

మేషం : ఆర్థికస్థితి ఒకింత మెరుగుపడటంతో ఊరట చెందుతారు. కూరగాయలు, పండ్లు, కొబ్బరి, ధాన్యం స్టాకిస్టులకు కలిసివచ్చే కాలం. వృత్తి వ్యాపారులకు అన్ని విధాల కలిసిరాగలదు. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. కొంతమంది మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగేలా వ్యవహరిస్తారు.

వృషభం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు తమ ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు ఉదరం, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. రుణం ఓ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం ఫలిస్తుంది. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు.

మిథునం : భాగస్వామిక చర్చలు, ఒప్పందాలకు సంబంధించిన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగుల వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. బంధుమిత్రుల రాకపోకల వల్ల అసౌకర్యానికి లోనవుతారు.

కర్కాటకం : నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు అధికారుల నుంచి వేధింపులు తప్పవు. ద్విచక్రవాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్థిరచరాస్తుల అమ్మకం విషయంలో పునరాలోచన మంచిది. సభా సమావేశాలలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు.

సింహం : ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది. బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉద్యోగస్తులు అధికారులకు మరింత సన్నిహితమవుతారు. గృహ నిర్మాణాలలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది.

కన్య : పత్రికా సంస్థలలోని వారు ఎంత శ్రమించినా గుర్తింపు ఏ మాత్రం ఉండదు. బంధుమిత్రులు మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పండ్లు, పూలు, తినుబండారాల వ్యాపారస్తులకు పురోభివృద్ధి. హమీలు, చెక్కుల జారీ విషయంలో ఏకాగ్రత వహించండి. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు.

తుల : వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, బేకరీ వ్యాపారులకు పురోభివృద్ధి. దైవ, సామాజిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. దంపతుల మధ్య దాపరికం మంచిది కాదు. కొన్ని పనులు అసంకల్పితంగా పూర్తి చేస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాలు అనుకూలం.

వృశ్చికం : వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాల దిశగా సాగుతాయి. మీ సమర్థత, నిజాయితీలు అందరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబీకులకు తెలియజేయటం మీ బాధ్యతగా భావించండి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది.

ధనస్సు : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఒక వేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు మొదలెడతారు. ఇంటా, బయటా ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీలకు చికాకులు తప్పవు. రాజీ మార్గంతో కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

మకరం : చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమిస్తే సత్ఫలితాలు పొందగలరు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు.

కుంభం : బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. హోటల్, క్యాటరింగ్ పనివారలకు వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆపత్సమయంలో ఆత్మీయుల తోడ్పాటు మీకు మనోధైర్యాన్నిస్తుంది. తలపెట్టిన పనిలో ఆటంకాలు, చికాకులు ఎదురైనా తెలివితో పరిష్కరిస్తారు.

మీనం : ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. మిమ్ములను కాదన్నవారే మీకు చేరువయ్యేందుకు యత్నిస్తారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. బంధువుల రాక మీకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కుటుంబ, ఆర్థిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రియతములకు బహుమతులు అందిస్తారు.