బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా చేసిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ముఖ్యంగా, బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులను షాక్‌కు గురయ్యారు.
ఉదయ్ గతంలో ‘ధూమ్’, ‘ధూమ్ 2’, ‘ప్యార్ ఇంపాజిబుల్’ వంటి చిత్రాల్లో నటించారు. పైగా, ఈయన ఎంతో ధైర్యవంతుడు కూడా. గతంలో ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడుతున్న వారిని దగ్గరకు తీసుకొని ధైర్యం అందించాలని సలహా కూడా ఇచ్చారు.
అలాంటి వ్యక్తి ఇపుడు చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేసింది. తాను చావుకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని రాయడంతో ప్రతి ఒక్కరు ఖంగు తిన్నారు.
ఉదయ్ చోప్రా తన ట్విట్టర్లో మీ అందరికి ఓ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా పరిస్థితి బాగోలేదు. ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికి ఓడిపోతూ వస్తున్నాను. కొన్ని గంటల పాటు నా ట్విట్టర్ ఎకౌంట్‌ని డీ యాక్టివేట్ చేశాను. చావుకి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది.
ఆత్మహత్య చేసుకోవడానికి ఇదే సరైన సమయమా అని అనిపిస్తోంది. నేను త్వరలోనే ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోతాననిపిస్తుందంటూ సంచలన ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ చూసిన కొందరు నెటిజన్స్ ఆయన ఆలోచనలని మార్చే ప్రయత్నం చేసే దిశగా ట్వీట్ చేస్తూ ధైర్యాన్ని అందిస్తున్నారు.
అయితే ఉదయ్ ఈ ట్వీట్స్ పెట్టిన కొద్ది నిమిషాల తర్వాతే డిలీట్ చేశారు. కాని కొందరు స్క్రీన్ షాట్స్ తీయడంతో అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజులు అమెరికాలో ఉన్న ఉదయ్ ఇటీవల ముంబై వచ్చారు.