వైఎస్‌ మృతికి తర్వాత సీఎంను చేస్తే జగన్.. రూ.1500 కోట్లు ఇస్తానన్నారట..

0
47

వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక సీఎం కావాలని జగన్ భావించారని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు.

కడప జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ మృతి చెందాక తనను సీఎం చేస్తే కాంగ్రెస్‌కు రూ.1500 కోట్లు ఇస్తానని జగన్ చెప్పినట్టు విమర్శలు చేశారు. జగన్ చెప్పిన మాటలు ఇంకా తనకు గుర్తున్నాయని ఫరూక్ అబ్ధుల్లా ఆరోపించారు.

జగన్‌కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఇలాంటి వ్యక్తితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ తన భవిష్యత్తును చక్కదిద్దుకుని ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తారని ఫరూక్ అబ్ధుల్లా కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఫరూక్ అబ్ధుల్లా టీడీపీకి మద్దతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొన్నారు. అంతేగాకుండా.. టీడీపీకి మద్దతుగా దేవెగౌడ, మమతాబెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, అరుణ్ శౌరి లాంటి నేతలు ప్రసంగించనున్నారు.

వీరి రాకతో ఏపీ టీడీపీలో మరింత జోష్ పెరిగింది. కర్నూలుతో పాటు నంద్యాల, అవనిగడ్డ, పత్తికొండ, కడపల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు.