తెల్ల జుట్టును నివారించే పొద్దుతిరుగుడు గింజలు

0
194

పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఇ సమవృద్ధిగా దొరుకుతుంది. ఇది కొవ్వుని కరిగించడంతోపాటు గుండెజబ్బులకీ, ఆస్తమా ఆర్ధ్రయిటిస్ వ్యాధులకీ కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నియంత్రిస్తుంది. ఇందులోని లినోలిక్ ఆమ్లం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తంది.

గర్భిణులకు మేలు చేసే ఫోలేట్లూ, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే కొవ్వులూ కూడా పుష్కలమే. వీటిల్లోని ప్రొటిన్లు సెరటోనిన్‌ను విడుదల చేయడం ద్వారా ఒత్తిడినీ డిప్రెషన్‌ని తగ్గిస్తే, కోలీన్ జ్ఞాపకశక్తికీ తెలివితేటలకీ తోడ్పడుతుంది.

మెగ్నీషియం ఎముకుల వృద్ధికీ నరాల పనితీరుకీ తోడ్పడుతుంది. మెనోపాజ్‌లో వీటిని తింటే మధుమేహం తలెత్తే సమస్య తగ్గుతుంది. పేగు క్యాన్సర్‌ని నిరోధిస్తుంది. సెలీనియం దెబ్బతిన్న జన్యువుల్ని సరిచేయడం ద్వారా క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.

వీటిలో ఫ్యాటీఆమ్లాలు చర్మంమెరుపుకీ, శిరోజాల పెరుగుదలకీ తోడ్పడతాయి. కాపర్ తెల్లజుట్టుని తర్వగా రానివ్వదు. మెులకెత్తిన గింజల్ని తినడం వల్ల ఛాతీలో కఫం తగ్గి ఉపశమనం ఉంటుంది. అందుకని ఈ గింజల్ని వేయించుకోని తిన్నా లేదా పిండి రూపంలో వాడినా మంచిదే.