టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా. ఈమె తాజాగా ఓ అంగ్ల పత్రికకు ఇంటర్వూ ఇచ్చింది. ఇందులో తన మనసులోని మాటను కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. డేటింగ్‌కి వెళ్లే అవకాశం వస్తే ఎవరితో వెళ్తారని అడిగిన ప్రశ్నకు ఆమె ఏమాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పింది.
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రయిక్’ సినిమా చూశానని, తన నటనతో విక్కీ ఆకట్టుకున్నాడని తెలిపింది. సో… డేటింగ్‌కు వెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా అతనితోనే డేటింగ్‌కు వెళతానని చెప్పారు.
ఇకపోతే, మీటూ ఉద్యమంపై స్పందిస్తూ, మిల్కీబ్యూటీ, తమకు ఎదురైన అనుభవాల గురించి మాత్రమే చర్చించుకోవడానికి మీటూ ఉద్యమం ఉందని తెలిపింది. దీని గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలని, కానీ ఒక్కోసారి ఇది ఆటలా మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. మీటూ ఉద్యమాన్ని మరింత సీరియస్‌గా తీసుకుని ఉంటే, చిత్ర పరిశ్రమలో మనం అనుకున్న మార్పులను చూసి ఉండేవాళ్లమని వ్యాఖ్యానించింది.