‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వర్మ బ్రాండ్.. ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపుతుందా?

0
35

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రివ్యూ రిపోర్ట్
నటీనటులు : విజయ్ కుమార్, యజ్ఞ శెట్టి,శ్రీతేజ్,
మ్యూజిక్ : కళ్యాణి మాలిక్
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఎన్నికల వరకు ఆపాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో..
తెలుగు దేశం వ్యవస్థాపక దినోత్సవమైన మార్చి 29న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశాడు. త్వరలోనే ఏపీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.. ఆర్జీవీ. ఇక ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ ఎలా వుందో చూద్దాం..

బాలకృష్ణ.. తన తండ్రి జీవితాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. అందులో మొదటి భాగాన్ని ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9న రిలీజ్ చేస్తే.. రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎన్టీఆర్ తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవమైన మార్చి 29న అనుకోకుండా రిలీజ్ చేయడం జరిగింది.

కథలోని సారాశం..
1989 ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ జీవిత కథ రాయడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి ఎలా అన్నగారికి దగ్గరైంది. ఆ బంధాన్ని కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ఎలా ప్రతిఘటించారు. అన్నగారు లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకోవడం. లక్ష్మీ పార్వతిని సాకుగా చూపి చంద్రబాబు..ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఎన్టీఆర్‌ను గద్దె దించి తాను చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం..ఆ తర్వాత అన్నగారు చనిపోవడంతో కథ ముగించాడు రామ్ గోపాల్ వర్మ.

నటీనటుల సంగతికి వస్తే..
ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన విజయ్ కుమార్ అనే రంగస్థల నటుడు తన పరిధి మేరకు అచ్చు ఎన్టీఆర్ చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చాడు. అన్నగారి ఆహార్యాన్ని డైలాగ్ డెలవరి విషయంలో నటించాడనేకంటే జీవించాడనే చెప్పాలి.

మరోవైపు చంద్రబాబు నాయుడు పాత్రను చేసిన శ్రీతేజ్ తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా కుట్రలు, కుతంత్రాలు,రాజకీయాలు తెలిసిన వ్యక్తి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. మొత్తంగా ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు.

ఇక లక్ష్మీ పార్వతిగా నటించిన యజ్ఞాశెట్టి తర పరిధి మేరకు బాగానే నటించింది. ఇక వర్మ కూడా ఆమె పాత్రను మదర్ థెరిసా తరహా పాత్రలో తీర్చిదిద్దాడు. మరోవైపు హరికృష్ణ, బాలకృష్ణ, మోహన్ బాబు, పురంధేశ్వరి పాత్రల్లో నటించిన నటీనటులతో పాటు మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు పర్వాలేదనిపించారు.

మొత్తానికీ సార్వత్రిక ఎన్నికల వేళ ఈ సినిమా ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా చూడాలి. సంగీతం విషయానికొస్తే.. కళ్యాణి మాలిక్ ఇచ్చిన సిట్యూవేషనల్ మ్యూజిక్ బాగుంది. చాలా రోజుల తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు ఈ సినిమాలో వినబడింది. కెమెరా వర్క్, పొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మొత్తానికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ వర్మ మార్క్‌ ఎన్టీఆర్ అనే చెప్పాలి.

మరోవైపు చంద్రబాబు నాయుడు పాత్రను టోటల్‌గా విలన్‌గా చిత్రీకరించాడు. ఇక చంద్రబాబు పాత్ర సినిమాలో కనిపించేటపుడు పాముకు సంబంధించిన నాదస్వరం మ్యూజిక్ పెట్టడం హైలెట్.ముఖ్యంగా రామోజీరావు ఈనాడు సపోర్ట్‌తోనే చంద్రబాబు..తెలుగు దేశం ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయించినట్టు చూపించారు.

ప్లస్ పాయింట్స్
చంద్రబాబు నాయుడు పాత్ర చిత్రీకరణ
రామ్ గోపాల్ వర్మ టేకింగ్
బాబు వెన్నుపోటు ఎపిసోడ్

మైనస్
క్లైమాక్స్ నత్తనడకన నడవటం..
స్లో నరేషన్

రేటింగ్- 3/5