సైకిల్ తొక్కి అలిసి పోయాయని… ఫ్యాన్ కింద చల్లగా ఉందని టీడీపీ పార్టీ పరిస్థితి, వైఎస్సార్ సీపీ పరిస్థితిపై ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన స్నేహితుడు, సోదర సమానుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూచేపల్లి శివప్రసాదరెడ్డికి చట్టసభల్లో స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రేమ, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పారు.
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో జరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సభలో మాగుంట మాట్లాడారు. తాను టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడాన్ని జీర్ణించుకోలేని మంత్రి శిద్దా రాఘవరావు తాను టీడీపీని మోసం చేశానని అంటున్నారని.. దర్శి నియోజకవర్గంలో వాళ్ల విషయాలన్ని నాకు తెలుసని హెచ్చరించారు. మాగుంట కుటుంబం ప్రజా సేవకే అంకితమన్నారు.
ప్రస్తుతం ఫ్యాన్ స్పీడు 120 కిలో మీటర్లతో దూసుకుపోతుందని, ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్‌కు, ఎంపీ అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.