దేశం తర్వాతే పార్టీ… ఆ తర్వాతే వ్యక్తిగతం : అద్వానీ ట్వీట్

0
53

గత ఐదేళ్లుగా మౌనమునిలా ఉన్న భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ఇపుడు మౌనం వీడారు. 17వ సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉన్న అద్వానీ.. ఇపుడు తన ట్విట్టర్ ఖాతాను యాక్టివేట్ చేసి.. ఆయన చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

‘మొదట దేశం… తర్వాత పార్టీ.. ఆ తర్వాతే వ్యక్తిగతం’ అంటూ తన బ్లాగ్‌లో ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశాన్ని ఊపేస్తున్నాయి. అన్ని పార్టీల నేతలతో పాటు సామాన్యులు కూడా అద్వానీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.

ముఖ్యంగా ట్విట్టర్‌లో దీనిపై భారీ చర్చ కొనసాగుతోంది. ఆయన పేరుతో వచ్చిన హ్యాష్ ట్యాగ్ ఇండియాలో టాప్-3 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్‌ను ఊపేస్తోంది. ఐదేళ్ల తర్వాత అద్వానీ తన బ్లాగ్‌ను వినియోగించడం గమనార్హం.