ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ సురేశ్ గోపీని బీజేపీ ప్రత్యక్ష ఎన్నికల యుద్ధంలోకి దింపింది. ఈయన్ను కేరళలోని త్రిసూర్ లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను కేటాయించింది.
నిజానికి ఈ స్థానం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై, జనరల్ సెక్రటరీ ఎంటీ రమేశ్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు కృష్ణదాస్, మాజీ కాంగ్రెస్ నేత టామ్ వడక్కన్ ఈ సీటు కోసం పోటీపడినప్పటికీ పార్టీ అధినాయకత్వం సురేశ్ గోపీవైపే మొగ్గుచూపింది.
కాంగ్రెస్ నుంచి టీఎన్ ప్రతాపన్, సీపీఐ నుంచి రాజాజి మాథ్యూ ఇక్కడ పోటీ చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి సీపీఐ నేత జయదేవన్ కాంగ్రెస్ అభ్యర్థి ధనపాలన్పై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. కేరళలో ఇప్పటివరకూ ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన కాషాయ పార్టీ ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో బోణీ కొట్టాలన్న కృతనిశ్చయంతో ఉంది.
ఇందుకోసం అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. గత ఎన్నికల్లో తృటిలో చేజారిన తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి మిజోరాం మాజీ గవర్నర్ రాజశేఖరన్‌ను బరిలో దించిన విషయం తెల్సిందే. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మాజీ మంత్రి శిశిథరూర్ పోటీలో ఉన్నారు.