మోడీ చిల్లర మల్లర ప్రధాని.. కొత్త రెవెన్యూ చట్టం తెస్తా : కేసీఆర్

0
53

జూన్ తర్వాత దేశమే అశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెవెన్యూ భూముల సమస్య పరిష్కారం అయ్యేలా చట్టం ఉటుందన్నారు. రైతులు ఎమ్మార్వోల చుట్టు తిరిగే పని లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. నిర్మల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేసీఆర్.. త్వరలోనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

దేశంలోనూ గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక అవసరాల దృష్ట్యా నిర్ణయాలు ఉండాలని అన్నారు. పసుపు బోర్డు కావాలని కోరిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు. దేశంలో కావాల్సినంత వనరులు ఉన్నా వాడుకునే తెలివి లేదన్నారు.

అటు బీజేపీ తీరుపైనా కేసీఆర్ ఫైర్ అయ్యారు. దేశంలోని దేవాలయ్యాలన్ని బీజేపీవాళ్లే కట్టించారా? అని ప్రశ్నించారు. సమాజాన్ని విభజించాలనే ఆలోచన బీజేపీదని విమర్శించారు. ఎన్నికలు రాగానే హిందువులు, ముస్లింలు, పాకిస్తాన్ గుర్తు వస్తాయని ఆరోపించారు.

పైగా, ప్రధాని నరేంద్ర మోడీపైనా విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే నల్లధనం పాతాళంలో ఉన్నా తెచ్చి ఇంటికి 15 లక్షలు ఇస్తనని మోడీ గత ఎన్నికల్లో చెప్పిండు. 15 రూపాయాలన్న ఇచ్చిండా? ఇప్పుడు దానిగురించి మాట్లాడుతుండా మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతుండు? సిగ్గు, లజ్జ ఉండొద్దా మనకు! పదికోట్లమందికి ఉద్యోగాలిస్తమన్న బీజేపీ.. కోటిమందికైనా ఇచ్చిర్రా? ఉందా లెక్క? చూపిస్తరా? అందుకే ప్రధాని మోడీ చిల్లర మల్లర ప్రధాని అంటూ ఆరోపణలు గుప్పించారు.