మోదీ రోజూ మేకప్ వేసుకుని, వ్యాక్సింగ్ చేయించుకుంటారు.. అందుకే?

0
36

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోజూ మేకప్ వేసుకుని, వ్యాక్సింగ్ చేయించుకుటారు. కానీ తాము అందంగా కనిపించకపోవడం వల్లే మీడియా తమను పట్టించుకోవడం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విమర్శించారు.

మోదీ అందంగా కనిపిస్తారు కాబట్టే ఆయన్ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు అందంగా ఉండడం లేదనే మీడియా వారిని చూపించడం లేదన్నారు.

బీజేపీ నేతలు తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం మానేసి మోదీ ముఖం చూసి ఓటెయ్యాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. కన్నడిగులకు మోదీ ఏం చేశారో చెప్పాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య ఇకపైనా పొత్తు కొనసాగుతుందని కుమారస్వామి స్పష్టం చేశారు.