రోజూ ఓ ఆరెంజ్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఆరెంజ్ పీల్‌తో చర్మానికి ఎంతో మేలు జరుగుతుందని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని.. రెండు స్పూన్ల ఆరెంజ్ పీల్ పొడికి రెండు స్పూన్ల పెరుగు, తేనె చేర్చి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగిస్తే చర్మం మిలమిల మెరిసిపోతుంది.
మొటిమలు దూరమవుతాయి. నారింజ చర్మానికి సహజసిద్దమైన బ్లీచ్ వలె పనిచేస్తుంది. క్రమంగా చర్మం మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా చేయడమే కాకుండా, విషతుల్య కణాలను తొలగించడంలో సహాయం చేసే డీటాక్సిఫై లక్షణాలను కలిగి ఉంటుంది. నారింజ సిట్రస్ పండ్ల వర్గానికి చెందింది, క్రమంగా ఇది ఆక్నే సమస్యలను నివారించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఈ నారింజ ఫేస్ ప్యాక్ని కనీసం వారానికి ఒకసారి అనుసరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలను పొందవచ్చునని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు.