పిచ్చెక్కిస్తున్న రకుల్ మార్ఫింగ్ ఫోటోలు..

0
37

టాలీవుడ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులో ప్రతి స్టార్ హీరో సరసన నటించింది. తాజాగా టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సరసన నటించనుంది. అయితే, ఏ స్టార్‌తో పని చేసినా ఆమె దారుణమైన ఫెయిల్యూర్స్‌ను చవిచూసింది. అయినప్పటికీ.. ఈ అమ్మడుకి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. దీంతో తెలుగులో ఈ భామకు ఛాన్సులు తగ్గాయి. ఫలితంగా బాలీవుడ్‌పై దృష్టిసారించింది.

రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్ సరసన నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం “దే దే ప్యార్ దే”. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన సీనియర్ హీరోయిన్ టబు, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. టబు అజయ్ దేవగన్ భార్యగా నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ అతడికి ప్రేయసిగా నటిస్తుండడం విశేషం.

మే 17వ తేదీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షోలో రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఈ చిత్రంలోని రొమాంటిక్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ చీర కట్టులో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయి డాన్స్ చేసింది.

ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ వల్లే ప్రస్తుతం రకుల్ ప్రీత్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సాంగ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హాట్‌గా కనిపిస్తున్న దృశ్యాల్ని కొందరు మార్ఫింగ్ చేసి అసభ్యంగా చిత్రీకరించారు.

మార్ఫింగ్ బారీన పడటం హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యే సమస్య. తమ ఫోటోలని కొందరు అసభ్యంగా చిత్రీకరించి వైరల్ చేస్తుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ మార్ఫింగ్ అయిన దృశ్యాలు కొన్ని వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ డాన్స్ చేస్తుంటే అసభ్యంగా కనిపిస్తున్నట్లు ఆ మార్ఫింగ్‌లో చిత్రీకరించారు.