చర్మ సౌందర్యానికి కొన్ని చిట్కాలు

0
48

బాదం పాలు ముఖానికి పట్టించి రాత్రంతా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ఫ్రెష్‌గా తయారవుతుంది. నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి. రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే మంచిది. ఉదయానికి ముఖం కాంతిని సంతరించుకుంటుంది. ప్రతి రోజూ చర్మానికి తేనెను పూతగా రాయాలి. తలవెంట్రుకలకు మాత్రం తగలకుండా జాగ్రత్త పడాలి..ఎక్కువసేపు ఉండకుండా కాస్త ఆరగానే స్నానం చేయాలి. మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి దాన్ని రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఇలా రాసుకున్న తరువాత మెత్తగా, నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది. పెదవులపై ఆలివ్ ఆయిల్‌ని రోజుకి రెండుసార్లు రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. రోజూ రెండు సార్లు మీగడ రాసుకున్నా పెదవులు మృదువుగా తయారవుతాయి.