చెవిపోటుకు పెరటి వైద్యం…

0
82

తరచూ ఇయర్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని వినడం, చలిగాలిలో తిరగడం, కొన్ని రకాల వైరల్ ఇన్ఫ్‌క్షన్ కారణంగా చెవిలో నొప్పి రావడం, చెవి మెుత్తం ఏదో స్రావంతో నిండినట్లుగా ఉండటం చూస్తుంటాం. అలాటప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఇంట్లోనే చేసుకునే చిట్కాలు.

వెల్లుల్లిపాయలు నుంచి కొద్దిగా రసంపిండి, దాన్ని వేడి చేసి రెండు మూడు చుక్కలు వేసి చెవిని అలాగే ఓ పది నిమిషాలు ఉంచాలి. లేదా ఆలివ్ నూనెలో వెల్లుల్లి రసం పిండి వేసినా మంచిది. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే అందులోని యాంటీ గుణాల వల్ల ఇన్ఫ్క్షన్ తగ్గుతుంది.

రోజుకి రెండుసార్లు కొబ్బరినూనె వేసినా మంచిదే. అందులోని లాపిక్ ఆమ్లానికి యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉండటంతో ఇన్ఫ్క్షన్ తగ్గుతుంది. ఉల్లిపాయని వేడిచేసి రసంపిండి అది వేసినా కూడా ఇన్ఫ్క్షన్, నొప్పి తగ్గుతాయి.

సముద్రపు ఉప్పు తీసుకుని, శుభ్రమైన సాక్సులో వేసి మూటలా కట్టి, పెనంమీద పెట్టి వేడి చేయాలి. తర్వాత ఈ ముటతో చెవి వెనుక భాగంలో కాపడం పెట్టాలి. దీని వల్ల నొప్పి తగ్గుతుంది.